: ‘నోకియా’లో ఉద్యోగులపై మరోమారు వేటు!


ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘నోకియా’ తమ సంస్థ ఉద్యోగులపై మరో మారు వేటు వేసింది. సొంత దేశమైన ఫిన్ లాండ్ లో 1,032 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు చెబుతోంది. అయితే, ఎంతమంది ఉద్యోగులను పక్కనపెడుతుందన్న విషయాన్ని మాత్రం సంస్థ అధికారులు వెల్లడించలేదు. ఆయా దేశాల్లో తమ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ‘నోకియా’ వెల్లడించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ పెరిగిపోవడంతో నోకియా సంస్థ ఆ పోటీని తట్టుకోలేకపోవడంతో సంస్థ ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో, ఖర్చులు తగ్గించుకునేందుకుగాను తమ సంస్థ ఉద్యోగుల విషయంలో కోతవేస్తూ వచ్చింది. గత దశాబ్ద కాలంగా ‘నోకియా’ తమ సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News