: నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష


నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 21 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, విజయవాడ, విశాఖపట్టణం, నెల్లూరు, తిరుపతి పట్టణాలలో జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. పేపర్-1 పరీక్షకు ఉదయం 7.30 గంటల నుంచి, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిబంధనల విషయానికొస్తే, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే ఓఆర్ఎస్ పత్రాన్ని నింపాలి, ఓఆర్ఎస్ ఒరిజినల్ పత్రాన్ని పర్యవేక్షకులకు ఇవ్వాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ పరికరాలతో ఫొటో, వేలిముద్రల సేకరణ, అభ్యర్థుల వెంట హాల్ టికెట్, ఫొటో గుర్తింపుకార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, బూట్లు, హైహీల్స్ పాదరక్షలు, ఆభరణాలు, పొడుగుచేతుల చొక్కాలు ధరించిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. కాగా, జూన్ 5న జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’, జూన్ 12న పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే కనుక సుమారు 1.58 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News