: బీజేపీ సీనియర్ నేతతో నిత్యం ఫోన్లో టచ్ లో ఉన్న దావూద్ ఇబ్రహీం


వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్‌ మనీష్‌ భంగాలే హ్యాకింగ్ చేయడం ద్వారా దావూద్ ఇబ్రహీంతో నిత్యం టచ్ లో ఉన్న నాలుగు ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. ఈ నాలుగు నెంబర్లలో ఒక నెంబర్ బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సేది కావడం విశేషం. దీంతో సుదీర్ఘ కాలంగా భారతదేశం పట్టుకోలేకపోతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆయన నిత్యం ఫోన్‌ కాల్స్ ద్వారా టచ్ లో ఉన్నారన్న విషయం కలకలం రేపుతోంది. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్‌ చేస్తున్న ఫోన్‌ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News