: బీజేపీ దుర్బుద్ధిని చెప్పడానికి ఇంత కంటే సాక్ష్యం కావాలా?: శివసేన


ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగగా బీజేపీ విజయం సాధించినది కేవలం అసోం రాష్ట్రంలోనే! మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బొక్కబోర్లా పడిందన్న సంగతి సగటు భారతీయుడికి తెలుసు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన మండిపడింది. 'కాంగ్రెస్ ముక్త భారత్' మంచి లక్ష్యమే అయినప్పటికీ, దానిని సాధించడం కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం కాదని శివసేన స్పష్టం చేసింది. 'అస్సాంలో బీజేపీ విజయం సాధించింది. కేరళను లెప్ట్ ఫ్రంట్ దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. తమిళనాడులో ఏఐడీఎంకే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగా, కాంగ్రెస్, డీఎంకే కూటమి పుదుచ్చేరిలో అధికారం సాధించింది. అయితే బీజేపీ ఈ ఫలితాలను హైజాక్ చేస్తోందని శివసేన మండిపడింది. అన్ని రాష్ట్రాల ఫలితాలు తామే సాధించామన్నట్టు, కాంగ్రెస్ పార్టీని తామే మట్టికరిపించామన్న రీతిలో ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని శివసేన విమర్శించింది. అసోంలో బీజేపీ పొత్తులతోనే గెలిచిందన్న విషయం గుర్తించుకోవాలని శివసేన సూచించింది.

  • Loading...

More Telugu News