: మినీ మహానాడులో ప్రసంగిస్తూ కుప్పకూలిన ఎల్.రమణ
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అస్వస్థతకు లోనయ్యారు. రంగారెడ్డి జిల్లా మినీమహానాడులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు హుటాహుటీన ఆయనను హైదరాబాదులోని యశోదా ఆస్పత్రికి తరలించారు. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్సనందిస్తున్నారు.