: మహిళా జర్నలిస్టుతో గేల్ అభ్యంతరక వ్యాఖ్యలు... వెల్లువెత్తుతున్న విమర్శలు
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ వివాదాస్పద వ్యాఖ్యలతో పరువుపోగొట్టుకుంటున్నాడు. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా యాంకర్ ను పార్టీకి పిలిచి తీవ్ర విమర్శలపాలైన గేల్... తాజాగా ద టైమ్స్ మేగజీన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మహిళా జర్నలిస్టును అభ్యంతరకర ప్రశ్నలు అడిగి విమర్శలపాలయ్యాడు. విచ్చలవిడిగా ఉండే జమైకాకు చెందిన గేల్ వ్యాఖ్యలు కొత్త కానప్పటికీ, గేల్ ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అతని సహచరులు కూడా గేల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాష్ లీగ్ లో మంచి ప్రదర్శన చేసిన గేల్, ఐపీఎల్ లో విఫలమయ్యాడు. ఇంత వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడం లేదు. గేల్ ఆటపై మనసు లగ్నం చేస్తే భవిష్యత్ ఉంటుందని, ఇలాంటి విచ్చలవిడితనం మీద లగ్నం చేస్తే...అతని భవిష్యత్ నాశనమవుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. శృంగారపరంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ దుమారం రేగుతోంది. అసలే విండీస్ బోర్డుతో పీకల్లోతు వివాదంలో ఉన్న గేల్ కు ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? అని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు.