: రాజస్థాన్ లో జవానులు ఇసుకపై రొట్టెలు కాల్చేసుకుంటున్నారు!
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా వంటి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాదిన మాత్రం ఎండల తీవ్రత అధికంగానే ఉంది. అక్కడి వాతావరణం నిప్పుల కొలిమిగా తయారైంది. అయితే, 50డిగ్రీలను దాటిపోయిన వాతావరణాన్ని ఎదుర్కుంటోన్న రాజస్థాన్ లోని జైసల్మీర్ పరిసర ప్రాంతాలలోని జవానులు.. నిప్పుల కొలిమిలా మండిపోతోన్న ఎండనే ఆధారంగా చేసుకొని అక్కడి ఇసుకపై రొట్టెలు కాల్చేసుకుంటున్నారు. అక్కడి ఇసుకపై గిన్నెలో బియ్యం నీళ్లు పోసి అన్నం కూడా వండి చూపిస్తున్నారు. అక్కడి ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి సైనికులు అనేక తిప్పలు పడుతున్నారు. ఆ ఎండ వేడికి తమ బూట్లు కూడా కరిగిపోతున్నాయని చెబుతున్నారు.