: అనుచితంగా ప్రవర్తించిన ఐఏఎస్‌పై వేటు.. కొత్తవారికి గుణపాఠం కావాలంటున్న ప్రభుత్వం
ఐఏఎస్ హోదా ఉందన్న గర్వంతో ఛత్తీస్‌గఢ్ లోని అధికారి జగదీష్ శంకర్ కొన్నిరోజుల క్రితం అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో తాజాగా సస్పెండ్ అయ్యాడు. ఆ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఆయన తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ సస్పెన్షన్ కొత్తగా బాధ్యతలు స్వీకరించే అధికారులకు గుణపాఠంగా మారుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు చేస్తూ 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జగదీష్ శంకర్ అక్కడి రోగి బెడ్‌పై కాలు ఉంచి స్టైలుగా నిలబడి మాట్లాడుతుండగా క్లిక్ మనిపించిన ఫోటో అనంతరం నెట్ ద్వారా నెటిజన్లందరికీ చేరింది. నెటిజన్లు అధికారి ప్రవర్తనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరికి ఈ అంశం ప్రభుత్వ దృష్టికి రావడంతో అధికారికి తగిన శిక్ష పడింది.