: 25న కేరళ సీఎం కుర్చీపై కూర్చోనున్న పినరయి విజయన్‌


కేరళ ముఖ్యమంత్రిగా సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ పినరాయి విజయన్ ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం తిరువనంతపురంలో తమ పార్టీ సభ్యులతో నిర్వహించిన సమావేశం అనంతరం పినరాయి విజయన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రుల జాబితా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయ‌న పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పుపై ప్ర‌స్తుతం కసరత్తు చేస్తున్నామ‌ని తెలిపారు. సీఎం ఎన్నికపై నిన్న జ‌రిపిన స‌మావేశంలో సీపీఎం స్టేట్ కమిటీ.. ఆ పార్టీ సీనియ‌ర్ స‌భ్యుడు 93 ఏళ్ల అచ్యుతానందన్ ను ప‌క్క‌న‌బెట్టి, పినరాయి విజయన్ ను సీఎంగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News