: కష్టంగా ఉన్నా ఇష్టంగా చదివా: ఎంసెట్ ర్యాంకర్ నేహ


ఓ వైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు మనసులో డాక్టర్ కావాలన్న బలమైన కోరిక, ఎంసెట్, నీట్ మధ్య కొంత అయోమయం ఉన్నా, టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఎంసెట్ లో రాష్ట్రంలోనే నాలుగో ర్యాంకు తెచ్చుకోగలిగానని చిట్లూరి స్నేహ వ్యాఖ్యానించింది. ఏపీ ఎంసెట్ - మెడిసిన్ ఫలితాల విడుదల తరువాత ఓ టీవీ చానల్ తో మాట్లాడిన నేహ, కష్టంగా ఉన్నప్పటికీ, ఇష్టంగా చదవడం వల్లే ర్యాంకు తెచ్చుకున్నానని తెలిపింది. పరీక్ష రాసేటప్పుడు తొలుత బయోలజీ, ఆపై బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అటెంప్ట్ చేశానని, నమ్మకంతో పరీక్ష రాస్తూ, ఆన్సర్ గుర్తు రాని ప్రశ్నలను వదిలేస్తూ వెళ్లానని, ఆపై అవే గుర్తుకు వచ్చాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News