: తెలంగాణలో స్టార్టప్ కి ఊతం ఇవ్వడమే లక్ష్యం.. అమెరికా ఐటీ దిగ్గజాలతో భేటీ కానున్న కేటీఆర్


ప్ర‌పంచ ప్ర‌సిద్ధ కంపెనీలు గూగుల్‌, ఫేస్‌బుక్, అమెజాన్ హైద‌రాబాద్‌లో త‌మ కేంద్రాల‌ను నెల‌కొల్ప‌డంతో పాటు ఇటీవ‌లే యాపిల్ కూడా మ్యాప్ డెవ‌ల‌ప్ మెంట్ కేంద్రం ప్రారంభం చేయ‌డంతో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా వెళ్లారు. వ‌చ్చేనెల 3 వ‌ర‌కు ఆయ‌న అక్క‌డి ప‌లువురు ఐటీ దిగ్గ‌జాల‌తో భేటీ కానున్నట్లు స‌మాచారం. తెలంగాణలో స్టార్టప్ కు మ‌రింత ఊతం అందించ‌డమే కేటీఆర్ ప‌ర్య‌ట‌నలో ప్ర‌ధానాంశమ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్ తన ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాలిఫోర్నియాలో జరిగే అంతర్జాతీయ అర్బన్ క్లీన్‌ ఎనర్జీ సదస్సులోనూ పాల్గొంటారు.

  • Loading...

More Telugu News