: ఈ ఏడాది తృటిలో 'పద్మ'ను మిస్సయిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు!


దర్శకేంద్రుడుగా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ ఏడాది పద్మ పురస్కారాన్ని తృటిలో మిస్సయ్యారట. ఆయనతో పాటు, రెండుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డును పొందిన కంగనా రనౌత్, క్రికెటర్లు గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ తదితర ఎంతో మంది 2016 సంవత్సరానికి పద్మ అవార్డులకు సిఫార్సు చేయబడి కూడా, తుది జాబితాలో స్థానాన్ని పొందలేకపోయారని తెలుస్తోంది. వీరితో పాటు నేపథ్య గాయకుడు సుమన్ కల్యాణ్ పూర్, గజల్ మ్యాస్ట్రోలు తలాత్ అజీజ్, చందన్ దాస్ తదితరులు కూడా తృటిలో పద్మాలను మిస్ అయ్యారని కమిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ సంవత్సరం 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 10 మంది పద్మ విభూషణ, 19 మంది పద్మభూషణ, 83 మంది పద్మశ్రీ అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లలో రెజ్లర్ సుశీల్ కుమార్, డీఆర్డీఓ సైంటిస్ట్ కేడీ నాయక్, ఎర్త్ సైన్సెస్ విభాగం మాజీ కార్యదర్శి శైలేష్ నాయక్, ఐసీఏఆర్ మాజీ బాస్ ఎస్ అయ్యప్పన్, అణు శాస్త్రవేత్త రతన్ కుమార్ సిన్హా, జామియా మిలియా ఇస్లామియా వైస్ చాన్స్ లర్ తలాత్ అహ్మద్ తదితరులు ఉండగా, వీరిని తుది జాబితాకు ఎంపిక చేయలేదు.

  • Loading...

More Telugu News