: మరోసారి కలిసిన కోహ్లీ, అనుష్క ప్రేమజంట... ఇదే సాక్ష్యం!


ఎంతోకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆపై విడిపోయిన క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మలు తిరిగి కలిశారు. ఓ రెస్టారెంటులో డిన్నర్ చేసిన వీరు అక్కడి చెఫ్, స్టివార్డులతో కలిసి ఫోటో దిగగా, ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. గుజరాత్ లయన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన తరువాత ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లతో కలిసి అనుష్క హోటలుకు వెళ్లిందని, కోహ్లీతో కొంతసేపు గడిపిందని తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ తిరిగి కలిశారని, వారి మధ్య ప్రేమ కొనసాగుతోందని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రిందట వీరిద్దరూ ముంబైలో కలిసి డిన్నర్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News