: అంధకారంలో హైదరాబాద్... రోడ్లపై ట్రాఫిక్ జామ్!
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం గాలి వాన బీభత్సం కారణంగా నగర జీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలను రోడ్లపైకి రావద్దని అధికారులు సూచనలు చేశారు. కాగా, లిబర్టీ, ఖైరతాబాద్, సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం అయింది. సుమారు రెండు గంటలకు పైబడి వాహనచోదకులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.