: ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు మాదే!: నాయిని
పాలేరు ఉపఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపాయి. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ దే విజయమని అన్నారు. టీఆర్ఎస్ విజయాల పరంపరకు ప్రతిపక్షాల అడ్రస్ లు గల్లంతవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరాజయ భారం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని ప్రతిపక్ష నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే ఎక్కడ ఎన్నికలు వచ్చినా విజయం కట్టబెడుతున్నారని ఆయన తెలిపారు.