: బ్రహ్మోత్సవంలో తండ్రికి చెప్పులు తొడగడమనే సీన్ నాకు బాగా నచ్చింది!: హీరో మహేష్ బాబు


‘బ్రహ్మోత్సవం’ సినిమాలో తనకు ఆ క్యారెక్టర్ దొరకడం అదృష్టమని ప్రిన్స్ మహేష్ బాబు అన్నాడు. ఈ చిత్రం ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మన జీవితాలకు సంబంధించిన ఇటువంటి పాత్రల్లో నటిస్తుండటం ద్వారా చాలా విషయాలు మనకు తెలుస్తాయని అన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లోని కథల గురించి తాను పెద్దగా వివరించి చెప్పలేనని మహేష్ అన్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కథేమిటంటే తానేమీ చెప్పలేనని.. అదొక సంఘటనలాగా ఉంటుందని మహేష్ పేర్కొన్నాడు. ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని తాను బాగా ఎంజాయ్ చేశానని, ఈ చిత్రంలో తండ్రికి చెప్పులు తొడగడమనేది చాలా బాగా నచ్చిందని, ఇంతకు మించిన ఎమోషన్ ఉండదని మహేష్ అన్నాడు.

  • Loading...

More Telugu News