: 'కెప్టెన్'కు మరో దెబ్బ... పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం!


గోరుచుట్టుపై రోకటి పోటు అంటే ఏంటో కెప్టెన్ విజయ్ కాంత్ కు తెలిసి వస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతై నిండా బాధలో మునిగిపోయిన విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే రద్దయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీగా నిలబడాలంటే కనీసం 6 శాతం ఓట్లు పడాలి. డీఎండీకేకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే పడడంతో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 సీట్లు గెలుచుకుని చక్రం తిప్పిన విజయ్ కాంత్, తాజా ఎన్నికల్లో తన ప్రవర్తనతో నేతలు, కార్యకర్తలను దూరం చేసుకుని దారుణంగా ఓటమి పాలయ్యారు. కరుణానిధితో పొత్తు పెట్టుకుని ఉంటే కెప్టెన్ భవిష్యత్ మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News