: ముచ్చ‌ట‌గా మూడోసారి భార‌త్‌కు వస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈవో


మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌ నాదెళ్ల మూడోసారి భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మైక్రోసాఫ్ట్ భార‌త్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రాంలో భాగంగా ఈనెల చివ‌రి వారంలో ఆయ‌న భార‌త్‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఈనెల 30న మైక్రోసాఫ్ట్ నిర్వ‌హిస్తోన్న ఓ ప్రోగ్రాంలో ఆయన ప్ర‌సంగించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స‌త్య‌ నాదెళ్ల భార‌త్‌లోని ప‌లువురు వ్యాపారవేత్తలతో స‌మావేశం కానున్నారు. కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఢిల్లీలో ఏర్పాటు చేయ‌నున్న‌ ముఖాముఖి కార్యక్రమానికి కూడా స‌త్య‌ హాజ‌రవుతారు. భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఇక్క‌డి సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్స్‌తోనూ భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News