: శ్రీకాకుళంలో చేపల వర్షం.. కుప్పలు తెప్పలుగా రాలిపడ్డ వైనం
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వర్షపు నీటితో పాటు తమ పొలాల్లో చేపలు కూడా వచ్చి పడడంతో శ్రీకాకుళం పాతపట్నంలోని శిబ్బిలి గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈరోజు ఉదయం పొలాలకు చేరుకున్న రైతులకు అక్కడ కుప్పలుగా పడి ఉన్న చేపలు కనిపించాయి. తమ పొలాల్లో చేపల వర్షం కురవడంతో రైతులు వాటిని పట్టుకొని ఆశ్చర్యంగా చూశారు. కొన్ని చేపలను ఇంటికి తీసుకెళ్లారు. కాగా, నిన్న రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాలతో శ్రీకాకుళం జలమయంగా మారింది.