: గోల్డ్ మానెటైజేషన్ పథకంలో 'సిద్ధి వినాయకుడి' బంగారం


ముంబైలోని సిద్ధి వినాయకుడి బంగారు ఆభరణాలు ప్రధానమంత్రి గోల్డ్ మానెటైజేషన్ పథకం కింద చేరిపోయాయి. ఈ దేవాలయం పాలకమండలి 44 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది. దీనిని ప్రభుత్వ మింట్ లో కరిగిస్తారు. అదే సమయంలో ఏడాదికి 2.25 శాతం వడ్డీ కూడా తమకు లభిస్తుందని సిద్ధి వినాయక దేవస్థానం చైర్మన్ నరేంద్రపాటిల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద బంగారాన్ని ఎస్బీఐ శాఖలో జమచేశామన్నారు. దేశంలో బంగారం దిగుమతులను తగ్గించడంతోపాటు, అదే సమయంలో దేశంలో బంగారం నిల్వలు పెంచాలన్న ఆలోచనతో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద సిద్ధి వినాయక దేవస్థానం బాగా లబ్ధి పొందనుంది. ఎందుకంటే, 44 కేజీల బంగారంపై ఆలయానికి నెలనెలా 10 లక్షల రూపాయల వరకూ వడ్డీ రూపేణా ఆదాయం రానుందని పాటిల్ తెలిపారు. అంటే ఏడాదికి 1.2కోట్ల రూపాయలు. ఈ ఆదాయాన్ని డయాలసిస్ రోగులకు సాయం చేయడానికి ఖర్చు చేస్తామని పాటిల్ చెప్పారు. ప్రస్తుతం సిద్ధి వినాయక ఆలయం వద్ద 171 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News