: ఏపీలో ఎంసెట్ ‘మెడికల్’ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ని మరో ఏడాదికి వాయిదా వేస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆర్డినెన్స్ (అత్యవసర ఆదేశం) జారీ చేయడం పట్ల ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల విద్యార్థులకు కేంద్ర మంత్రి వర్గ నిర్ణయంతో ఊరట లభించినట్లు భావిస్తున్నారు.