: నల్గొండలో దారుణం.. గోనెసంచిలో శిశువు మృతదేహం లభ్యం
అప్పుడే పుట్టిన ఓ శిశువుని గోనె సంచిలో ఉంచి రోడ్డుపక్కన వదిలేసిన ఘటన నల్గొండ జిల్లాలోని పెన్‌పహాడ్ చిన్నారెడ్డిపాళెం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందుని కనీస మానవత్వం లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి ఎస్సీ కాలనీలో పడేసి వెళ్లారు. ఈరోజు ఉదయం గోనెసంచిలో ఏదో ఉండడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకి తెలిపారు. అనంతరం ఆ సంచి విప్పిచూడడంతో దానిలో ఓ శిశువు మృతదేహం కనిపించింది. శిశువును బతికుండగానే గోనె సంచిలో ఉంచి అక్కడ వదిలేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.