: ‘రోను’ ఉగ్రరూపం!... పోర్టుల్లో నాలుగో నెంబర్ హెచ్చరికలు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు


బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కారణంగా రంగప్రవేశం చేసిన ‘రోను’ తుపాను నేడు మరింత ఉగ్రరూపం దాల్చనుంది. విశాఖకు 110, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 60 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో నాలుగో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం కృష్ణా జిల్లా వరకూ విస్తరించింది. తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కింద ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీ సర్కారు రంగంలోకి దింపింది. ఏపీ పరిధిలో నేడు తీవ్ర రూపం దాల్చనున్న రోను తుపాను నేటి సాయంత్రానికి ఒడిశా వైపు వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ లో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News