: కోటి పారితోషికాన్ని అక్కర్లేదు పొమ్మన్న జరీన్ ఖాన్


కత్రినా కైఫ్ మీద కోపంతో సల్మాన్ తన 'యువరాజ్' సినిమాతో జరీన్ ఖాన్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదగడంలో జరీన్ వెనుకబడింది. కొన్ని విజయాలు వచ్చినప్పటికీ వాటిని క్యాష్ చేసుకోవడంలో తడబడింది. 'హేట్ స్టోరీ 3' విజయంతో జోరు మీదున్న జరీన్ ను ప్రచారకర్తగా ఉంటే కోటి రూపాయల పారితోషికం ఇస్తామని తాజాగా ఓ సంస్థ ఆమెను సంప్రదించింది. అయితే ఆ సంస్థ ఆఫర్ చేసిన పారితోషికం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ జరీన్ ఖాన్ మాత్రం దానిని తిరస్కరించింది. సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తో, లేక ఫుడ్ ప్రొడక్టో అయితే చేసే దానిని కానీ, అది బరువు తగ్గించే వెయిట్‌ లాస్‌ పిల్, అందుకే రిజక్ట్ చేశానని తెలిపింది. ఇలాంటి నకిలీ మందులతో ప్రజల్ని మభ్యపెట్టలేనని ఆ సంస్థకు స్పష్టం చేసింది. బొద్దుగా ఉండే జరీన్ ఖాన్ ఫిట్‌ అండ్‌ స్లిమ్‌ గా మారింది. దీనికి రోజూ జిమ్‌ లో కష్టపడి ఈ శరీరాకృతిని తెచ్చుకున్నానని, బరువు తగ్గడానికి వ్యాయామం తప్ప ఎలాంటి షార్ట్‌ కట్స్‌ లేవని స్పష్టం చేసింది. ఆమె తాజాగా సాయి కబీర్‌ దర్శకత్వం వహిస్తున్న డివైన్‌ లవర్స్‌ లో ఇర్ఫాన్‌ ఖాన్‌ సరసన నటించనుంది. గతంలో ఇదే పేరుతో అడల్ట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News