: రేపు రాజీనామా చేయనున్న కేరళ సీఎం ఊమెన్ చాందీ
ఈరోజు ప్రకటించిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం 47 స్థానాలు మాత్రమే సాధించిన యూడీఎఫ్ కూటమి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ రేపు తన పదవికి రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు కేరళ గవర్నర్ పి.సదాశివంను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేస్తారు. కాగా, కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 91, యూడీఎఫ్ 47, బీజేపీ 1, ఇతరులు 1 స్థానంలో గెలుపొందాయి.