: ‘అమ్మ’కు మళ్లీ అధికారం వెనుక ఆ ఆరుగురే కీలకం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అన్నా డీఎంకే విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర సృష్టించడానికి కారణం జయలలితకు సహకరించిన ఆ ఆరుగురేనని సమాచారం. ఎవరా ఆరుగురు? అంటే... ముగ్గురు ఐఏఎస్ లు, ముగ్గురు ఐపీఎస్ లు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న షీలా బాలకృష్ణన్, తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్, ఇద్దరు ఏడీజీపీలతో పాటు ఒక రిటైర్డ్ డీజీపీ ఉన్నారట. తన మిత్రురాలు శశికళ సహా ఈ ఆరుగురు సలహాలు, సంప్రదింపులతోనే అభ్యర్థుల ఎంపిక, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల రచన చేశారట. తమ పార్టీ నేతల కన్నా ఈ ఆరుగురినే ‘అమ్మ’ జయలలిత ఎక్కువగా విశ్వసించారని సమాచారం.