: ప్రియాంక వస్తే బలం పుంజుకుంటాం: దిగ్విజయ్ సింగ్
గతంలో రాహుల్ భజన చేసిన దిగ్విజయ్ సింగ్ తాజాగా గళం మార్చారు. యూపీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ప్రియాంకా గాంధీ జపం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోను ప్రియాంకా గాంధీ పేరు ఎత్తుతూ పార్టీ కార్యకర్తల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదేపదే ప్రియాంకా గాంధీ నామస్మరణ చేస్తున్నారు. తాజాగా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలవ్వడంతో స్పందించిన డిగ్గీ రాజా మాట్లాడుతూ, ప్రియాంకా గాంధీ రంగ ప్రవేశం చేస్తే, పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకి ఎవరైనా శిరస్సు వంచాల్సిందేనని ఆయన చెప్పారు.