: సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేను: సినీనటి పావలా శ్యామల


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనని సినీ నటి పావలా శ్యామలా అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకుంటానని కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాగా, పావలా శ్యామల ఆర్థిక పరిస్థితులు సరిగా లేవంటూ ఆమె దయనీయ పరిస్థితిపై ఒక పత్రికలో ఇటీవల కథనం వెలువడింది. దీనిపై స్పందించిన కేసీఆర్, ఆమెకు ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలని సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ ను పావలా శ్యామల బ్యాంకు ఖాతాలో వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన పట్ల తెలంగాణ సర్కార్ చూపిన చొరవను మరువలేనని, తనలాంటి ఎంతో మంది కళాకారులకు ప్రభుత్వం దారి చూపుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News