: బాలికను తల్లిని చేసి వదిలిన ఉగ్రవాదులు!
సరిగ్గా రెండేళ్ల కిందట నైజీరియాలోని చిబోక్ గ్రామంలో ఓ పాఠశాల నుంచి 273 మంది బాలికలను బొకోహారమ్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ 273 మంది బాలికల్లో అమీనా అలి దర్శా కెకి అనే ఓ బాలిక ఇప్పుడు చేతిలో చంటి బిడ్డతో సైన్యానికి కనిపించింది. అపహరణకు గురైన తరువాత ఏం జరిగిందన్నది ఆమె నేడు నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీని కలిసి వివరించనుంది. చిబోక్ గ్రామంపై విరుచుకుపడిన బోకోహరమ్ ఉగ్రవాదులు 273 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. వారి కోసం ఎంత గాలించినా ఫలితం లేదు. దీంతో వారిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలా తీసుకెళ్లిన వారిని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారని, బానిసలుగా ఉపయోగించుకున్నారని, కొంత మంది బాలికలను బలవంతపు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారని అమీనా అలి తెలిపింది. ఆమెను ఓ ఉగ్రవాది బలవంతపు వివాహం చేసుకుని కాపురం చేశాడు. ఫలితంగా గర్భందాల్చింది. అనంతరం ఆమెను వదిలేశాడు. దీంతో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను ఎత్తుకుని సాంబిసా అడవిలో తిరుగుతూ నైజీరియా బలగాలకు తారసపడటంతో ఆమెను సురక్షితంగా హెలికాప్టర్ ద్వారా తరలించి వైద్యం చేయించారు.