: నేను హైదరాబాదు వస్తే...ఆ రెండింటి కోసమే!: సచిన్


తాను కేవలం రెండే రెండు విషయాల కోసం హైదరాబాదు వస్తానని టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. దేశీ టెక్నాలజీ సెల్‌ ఫోన్‌ తయారీ కంపెనీ స్మాట్రాన్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్న సచిన్‌ హైదరాబాదు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ఒకటి క్రికెట్‌ కోసం, రెండు హైదరాబాద్ బిర్యానీ కోసమని అన్నాడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా బిర్యానీ తినకుండా వెళ్లనని పేర్కొన్నాడు. భారత్ ను సెల్ ఫోన్‌ తయారీ హబ్‌ గా మార్చాలని అన్నాడు. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని సచిన్ ఆకాంక్షించాడు. సచిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News