: సినీ నటుడు కృష్ణంరాజును పరామర్శించిన మహారాష్ట్ర గవర్నర్
ఇటీవల అస్వస్థతకు గురైన సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజును మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఈరోజు సాయంత్రం పరామర్శించారు. ముంబయి నుంచి వచ్చిన ఆయన బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి వెళ్లి కృష్ణంరాజు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.