: నేను వీఐపీని కాదు...ఎల్ఐపీని: మమతా బెనర్జీ


తాను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ని కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిలకపై కోల్ కతాలో ఎన్డీటీవీతో ఆమె మాట్లాడుతూ, లెస్ ఇంపార్టెంట్ పర్సన్ (తక్కువ ప్రాధాన్యత కలిగిన వ్యక్తి) నని అన్నారు. తన లక్ష్యం ఢిల్లీ కాదని, రాష్ట్రానికి సేవ చేయడమే తనకిష్టమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని పదవికి అభ్యర్థిగా నిలబడతారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తానేదీ కోరుకోవడం లేదని అన్నారు. తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని, వారంతా తీసుకునే నిర్ణయంపై అది అధారపడి ఉంటుందని ఆమె చెప్పారు. దేశరాజకీయాల్లో చిన్న పాత్ర పోషిస్తున్న తనకు అత్యాశ మాత్రం లేదని ఆమె తెలిపారు. తన లక్ష్యం కేంద్రం కాదని, రాష్ట్రమని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఎన్ని ఆరోపణలు వచ్చినా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆమెపై అంతులేని విశ్వాసం ఉంచడంతో బెంగాల్ లో దీదీ విజయం సాధించారు.

  • Loading...

More Telugu News