: అసోంలో తొలిసారిగా భాజపా విజయం.. భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే జరుగుతుందని లక్ష్మణ్ వ్యాఖ్య
ఈశాన్య భారతంలో కమలం వికసించడం పట్ల హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అసోంలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం పట్ల కె.లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. అసోంలో వచ్చిన ఫలితాలే భవిష్యత్తులో తెలంగాణలోనూ బీజేపీ రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ తమ కమలం వికసిస్తుందని, మోదీ నాయకత్వంలో ఇక్కడ కూడా విజయ ఢంకా మోగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం నుంచి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని గతంలో మోదీ ఇచ్చిన పిలుపుని ప్రజలు అనుసరిస్తున్నారని, దాని ఫలితంగానే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా కాంగ్రెస్‌ను ఓడించి మోదీ పిలుపును నిజం చేస్తున్నారని ఆయన అన్నారు.