: తిరుపతిలో నగర యువత, తెలుగు యువత ఢిష్యుం ఢిష్యుం!


మరో వారంలో తిరుపతిలో జరగనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు 'మహానాడు' ఏర్పాట్ల విషయంలో నెలకొన్న వివాదం నగర యువత, తెలుగు యువత కార్యకర్తల మధ్య యుద్ధానికి కారణమైంది. తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతుండగా, పార్టీ నగర అధ్యక్షుడు భాస్కర్, ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చి, అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో మహానాడు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న తెలుగు యువత కార్యకర్తలు నిరసన తెలుపగా, వాగ్వాదం పెరిగి ఒకరిని ఒకరు తోసుకుని పిడిగుద్దులు గుద్దుకునే వరకూ వెళ్లింది. తెలుగు యువత కార్యకర్త మధుతో పాటు, ఓ విలేకరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారినీ చెదరగొట్టారు. అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News