: అమ్మకు పాదాభివందనాల వెల్లువ!
తమిళనాట రికార్డు విజయాన్ని సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తున్న జయలలితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, అన్నాడీఎంకే నేతలు ఆప్యాయంగా 'విప్లవనాయకి'గా పిలుచుకునే ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ రోశయ్య నుంచి మంత్రుల వరకూ శుభాభినందనలు తెలుపుతున్నారు. ఈ మధ్యాహ్నం జయలలిత మీడియా సమావేశాన్ని ముగించిన తరువాత, ఎంతో మంది నేతలు ఆమెకు పుష్పగుచ్ఛాలిచ్చి పాదాభివందనాలు చేశారు. ఆమె మెప్పును పొందాలని కోరుకుంటున్న కొందరు తమిళ నేతలు ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశారు. వారందరి అభినందనలను చిరునవ్వుతో స్వీకరించిన జయలలిత, ఎంతో సంతోషంగా కనిపించారు.