: హీరో రవితేజకు షాకిచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు!
టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ్ రవితేజకు హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులు షాకిచ్చారు. ఈ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న ఏపీ 28 డీకే 4742 కారుకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటంతో, కారును ఆపిన పోలీసులు రూ. 800 జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం కార్లలోని వారు బయటకు కనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. అప్పటికప్పుడు అద్దాలకు ఉన్న నల్లటి ఫిల్మ్ ను తొలగించారు. పోలీసులతో ఎటువంటి వాదనకూ దిగకుండా, విధించిన జరిమానాను చెల్లించేసిన రవితేజ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కాగా, గత నెలలో జూనియర్ ఎన్టీఆర్ కారును సైతం ఇదే కారణంతో ఆపిన పోలీసులు జరిమానా విధించారన్న సంగతి విదితమే.