: విపక్షాలు 'శారద', 'నారద' అన్నా... ఓటర్లు మాత్రం 'మమతే' అన్నారు!


పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కారును పడగొట్టాలని ఓ వైపు నుంచి కాంగ్రెస్, మరోవైపు నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంతగా ప్రయత్నించినా ఓటర్లు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ప్రతిపక్షాలు పలు కుంభకోణాలను చూపిస్తూ, విమర్శల దాడులు చేసినప్పటికీ, వాటిని బెంగాల్ వాసులు ఏమాత్రం పట్టించుకోలేదు. నారదా స్టింగ్ ఆపరేషన్, శారదా కుంభకోణంలో చిక్కుకుని విచారణను ఎదుర్కొంటున్న వారు సైతం విజయం సాధించడం గమనార్హం. నారద స్టింగ్ లో ఇరుక్కున్న సుబేంధు అధికారి, ఫిర్హాద్ హకీమ్ లు నందిగ్రామ్, కోల్ కతా పోర్ట్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. శారదా స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చిన మాజీ మంత్రి మదన్ మిత్రా కమర్ హాతి నియోజకవర్గంలో విజయం సాధించారు. పలు ఆవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు పార్థా చటర్జీ, అమిత్ మిత్రా, జ్యోతిప్రియా మల్లిక్ తదితరులు సైతం విజయం సాధించారు. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, టీఎంసీ 213 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు 30, కాంగ్రెస్ 43, బీజేపీ 4 స్థానాలకు పరిమితం అయ్యేలా ట్రెండ్స్ వస్తున్నాయి.

  • Loading...

More Telugu News