: విపక్షాలు బురద జల్లితే, ప్రజలు ఓట్లతో కడిగేశారు: మమతా బెనర్జీ


విపక్షాలు తమపై ఎంతగా విమర్శలు చేసినా బెంగాల్ ప్రజలు వాటిని విశ్వసించలేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పోలింగ్ ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కు ఇది అపూర్వ విజయమని, విపక్షాలు చల్లిన బురదను ప్రజలు తమ ఓట్ల వెల్లువతో కడిగేశారని ఆమె అన్నారు. బెంగాలీలు చిరునవ్వులు చిందించినప్పుడే తనకు ఆనందం కలుగుతుందని పేర్కొన్న ఆమె, ఇంతటి ఘన విజయాన్ని కానుకగా ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తరువాత మరోసారి మాట్లాడతానని తెలిపారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ 43 స్థానాల్లో విజయం సాధించి 167 చోట్ల ఆధిక్యంలో వుండగా; వామపక్షాలు 3 చోట్ల గెలిచి 28 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 8 చోట్ల గెలిచి 37 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది.

  • Loading...

More Telugu News