: పుదుచ్చేరి అసెంబ్లీకి వరుసగా ఐదోసారి గెలిచిన మల్లాడి కృష్ణారావు


పుదుచ్చేరి రాష్ట్రంలో భాగమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ను ఆనుకొని ఉన్న యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడ్డ మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 8,754 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం మల్లాడి మాట్లాడుతూ, తనను మరోసారి ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పునరంకితమవుతానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తానని తెలిపారు. కాగా పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ఆరు చోట్ల గెలిచి ఒక చోట ఆధిక్యంలో ఉండగా, ఏఐఎన్ఆర్సీ 5 చోట్ల గెలిచి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 1 స్థానం గెలిచి రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News