: 'సీఎం కుర్చీ' ఎక్కుతానని చెప్పి, కనీసం ఖాతా తెరవలేని స్థితిలో 'జీరో' అయిపోయిన 'కెప్టెన్' విజయకాంత్!
తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిన డీఎండీకే అధినేత, హీరో విజయకాంత్, ఈ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నారు. సీఎం కుర్చీ వరకూ వెళతానని ఆయన చెప్పిన మాటలు ప్రగల్భాలేనని తేలిపోయింది. కనీసం ఖాతా కూడా తెరవలేని స్థితిలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డీఎండీకే ఆధిక్యంలో లేని పరిస్థితి కనిపిస్తోంది. తాను పోటీ పడిన ఉళుందుర్ పెట్టాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా ఓటమిపాలై, మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన పరుష వ్యాఖ్యలు, దుందుడుకుతనాన్ని ఎన్నోమార్లు చూసిన ఓటర్లు విజయకాంత్ ను దూరం పెట్టాలనే నిర్ణయించినట్టు తేలిపోయింది.