: నిహారిక కోసం తరలి వచ్చిన 'మెగా' కుటుంబ సభ్యులు


తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్న కొణిదెల నిహారికను అభినందించి, ఆశీర్వదించేందుకు మెగాస్టార్ కుటుంబం తరలివచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబంగా అలరిస్తున్న చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తెగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక పెద్ద స్టార్ అవ్వాలని వచ్చిన ప్రతి అతిథి కోరుకోగా, పవన్ కల్యాణ్ తరువాత తెరంగేట్రం చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, 'కంచె' స్టార్ వరుణ్ తేజ్... ఇలా మెగా వారసులంతా 'ఒక మనసు' ఆడియో వేడుకకు రావడం ఒక ఎత్తైతే ఇంతవరకు ఆడియో వేడుకలకు హాజరు కాని, నిహారిక అక్క, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా హాజరుకావడం విశేషం. అలాగే నిర్మాతగా ఉన్న 'టీవీ9' రవిప్రకాశ్ కూడా హాజరుకావడం మరో విశేషం. నిహారికను ఇంట్లో ముద్దుగా 'నీహా' అని పిలుస్తామని, నీహా ఈ రంగంలో కోరుకున్న ఆనందం సొంతం చేసుకోవాలని వారంతా ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News