: ప్రధానిని కలిసిన కాజోల్...స్కూళ్లలో పిల్లలకు హ్యాండ్ వాష్ పంపిణి చేయమని కోరిన బాలీవుడ్ భామ!
ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ కలిసింది. ఈ సందర్భంగా ప్రధానితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఆమె పంచుకుంది. మోదీని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానిని దేశంలోని స్కూళ్లలో పిల్లలకు హ్యాండ్ వాష్ పంపిణి చేయాలని కోరానని ఆమె చెప్పారు. చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని, వారి చేతులు పరిశుభ్రంగా ఉంటే పిల్లల్లో వ్యాపించే అంటురోగాల్లో సగం అంటురోగాలను నిరోధించవచ్చని తెలిపింది. అందుకే స్కూళ్లలో హ్యాండ్ వాష్ గురించి చర్చించానని కాజోల్ తెలిపింది. కాగా, లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ కు కాజోల్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.