: నవ్యాంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలి: ‘ప్రకాశం’ జెడ్పీ తీర్మానం
నవ్యాంధ్రప్రదేశ్ కు దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని ప్రకాశం జిల్లా జెడ్పీ సభ్యులు కోరారు. ఈ మేరకు నిన్న జరిగిన జెడ్పీ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. తెలుగు జాతి గౌరవానికి, ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ పేరును నవ్యాంధ్రప్రదేశ్ కు పెట్టడం ద్వారా ఆయనకు సముచిత స్థానం కల్పించినట్లవుతుందని జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు.