: నారావారిపల్లెలోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో ఇంకుడుగుంత


ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో ఇంకుడుగుంత తవ్వనున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని ఆయన ఇంట్లో ఇంకుడుగుంత, బోర్ వెల్ చార్జ్ స్ట్రక్చర్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకట నారాయణ, ఏపీవో ఆశారాణి, ఉపాధి సిబ్బంది నిన్న చంద్రబాబు ఇంటికి వెళ్లి పరిశీలించారు. తొలుత రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం మూడు అడుగుల చొప్పున పొడవు, వెడల్పుతో గుంత తవ్వడానికి రూ.37 వేల అంచనాతో చిత్తూరు జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపారు.

  • Loading...

More Telugu News