: ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి అభివృద్ధి చేస్తాం: సిద్ధార్థ్ నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అందించాల్సిన సాయం అందుతూనే ఉంటుందని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రతి నెల రెండుసార్లు కేంద్రమంత్రులు సమీక్షిస్తారని, ఏపీ సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ఆయన తెలిపారు. హోదాకి బదులు ఏపీకి నిధులను అందిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు ఇప్పటికే విడుదల చేశామని అన్నారు. అంతేగాక అదనంగా రూ.22,112 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి కేంద్ర సహకారంతోనే జరుగుతుందని ఆయన అన్నారు. హోదా ఇవ్వకపోయినా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.