: త‌మిళ‌నాడులో పురుషుల కంటే స్త్రీలే అత్యధిక సంఖ్యలో ఓట్లేశారు.. అరుదైన రికార్డు సృష్టించారు


త‌మిళ‌నాడులో మ‌హిళ‌లు అరుదైన రికార్డు న‌మోదు చేశారు. మొన్న అక్క‌డ నిర్వ‌హించిన ఎన్నిక‌ల పోలింగ్‌లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్య‌లో ఓటేసి రికార్డు నెల‌కొల్పారు. ఇంతకుముందు అక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల కంటే పురుష ఓటర్లే అత్య‌ధికంగా పాల్గొనేవారు. అయితే ఈ సారి దానికి భిన్నంగా మ‌హిళ‌ల ఓట్లే అత్య‌ధికంగా న‌మోదయ్యాయి. అంతేగాక‌, ఈ సారి ఎన్నిక‌ల్లో అక్క‌డ 327 మంది మ‌హిళా అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. నిన్న న‌మోద‌యిన 74.26 శాతంలో పురుషుల కంటే మ‌హిళ‌లు 3,84,678 మంది ఎక్కువ‌గా పాల్గొన్నార‌ని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News