: అక్కడ కప్పు టీ @ 6 లక్షలు!


ఛాయ్...శ్రమ జీవుల ఆత్మబంధువు. ‘టీ’ పడకపోతే చాలా మందికి ఏమీ తోచదు, ఇంకొందరికి ప్రకృతి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. మరికొందరికి ఐడియాలు రావు! అలాంటి చాయ్ పది రూపాయలు పెడితే కానీ రావడంలేదు. ఖరీదైన హోటల్ లో అయితే, దీని ఖరీదు పెరుగుతూ పోతుంది. అయితే చైనాలోని ఓ గ్రామంలో మాత్రం కప్పు టీకి 6 లక్షలు రూపాయలు ఛార్జ్ చేస్తారట! ఇంత ఖరీదా? అని ఆశ్చర్యపోకండి, ఈ ఛాయ్ పై ఉన్న నమ్మకాలు అలాంటివి. చైనాలోని వుయి పర్వతాల సమీపంలో ఉన్న వుయిశాన్‌ గ్రామంలో మాత్రమే ఈ ఖరీదైన ‘టీ’ దొరుకుతుంది. ఇక్కడ లభించే తేయాకు (ద హంగ్‌ పావ్‌) చాలా అరుదైనది. ఇక్కడున్న వుయు పర్వతంపైనే ఇది పెరుగుతుంది. దీనికి 18వ శతాబ్దం నుంచే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వుయు పర్వతంపై పెరిగే తేయాకుతో చేసిన టీని సంపన్నులు, రాజకుటుంబీకులు డాబు, దర్పానికి గుర్తుగా తాగేవారు. పర్వతంపై పెరగడంతో ఈ తేయాకులో ఆక్సిజన్‌ సామర్థ్యం అధికంగా ఉంటుందని, నలుపు రంగులో ఉండే ఈ తేయాకుల నుంచి తయారైన టీని ఒక్కసారి రుచి చూస్తే...దానిని చాలాసేపు ఆస్వాదించొచ్చని ఈ గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే ఈ టీ సుమారు 6 లక్షలు రూపాయలు పలుకుతుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తేయాకుకి నకిలీల బెడద ఎక్కువైందట. ఈ తేయాకులు తీసుకెళ్లి వేరే చోట్ల పెంచి మార్కెట్లో అమ్ముతున్నారట. నిజమైన వుయిషాన్ గ్రామానికే వెళ్లాలని చైనీయులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News