: జగన్ ను కలిసేందుకు బయలుదేరి అస్వస్థతకు గురైన వైకాపా నేత గుర్నాథరెడ్డి


కర్నూలులో జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతు పలకాలన్న ఉద్దేశంతో కార్యకర్తలతో సహా బయలుదేరిన అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం బయలుదేరిన ఆయన, కాసేపటికి కళ్లు తిరిగి పడిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆయన్ను వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను వైద్యులు పరీక్షిస్తున్నారు. కాగా, వైకాపా శ్రేణులు కర్నూలుకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరగడంతో, కార్యకర్తలు, గుర్నాథరెడ్డి కుటుంబీకులు కొంత ఆందోళన చెందారు. షుగర్ వ్యాధి ఉన్నందునే ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News