: సుబ్రహ్మణ్య స్వామి అసలు టార్గెట్ అరుణ్ జైట్లీ... మధ్యలో రాజన్ ను వాడుకుంటున్నారు: కాంగ్రెస్
బీజేపీ తరఫున కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సుబ్రహ్మణ్యస్వామి అసలు లక్ష్యం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పదవి నుంచి దించడమేనని, అందుకే ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆర్బీఐ పదవి నుంచి రాజన్ ను తక్షణం తొలగించాలని, ఆయన సంపూర్ణ భారతీయుడు కాదని, తన గ్రీన్ కార్డును పొడిగించుకుంటూ ఇక్కడ ఉంటున్నాడని స్వామి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జైట్లీని పదవీచ్యుతుడిని చేసే ఉద్దేశంతోనే సుబ్రహ్మణ్య స్వామి, ఈ తరహాలో రాజన్ ను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ నేత ఒకరు ఆరోపించారు.