: వైసీపీలో కొడాలి నానికి కీలక బాధ్యతలు!... పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పార్థసారధి!
నందమూరి హరికృష్ణకు నమ్మిన బంటుగా పేరుపడ్డ వైసీపీ నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని)కి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యత అప్పగించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొడాలి నానిని నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున కొడాలి నాని ఒంటరి పోరు చేస్తూ, అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావించినందునే జగన్ ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం. ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసిన పార్టీ నేత కొలుసు పార్థసారధిని కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.